TPT: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు.