MBNR: కౌకుంట్ల మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి ఫిర్యాదుల కోసం కూడా దూరాభార ప్రయాణాలు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. దొంగతనాలు, శాంతిభద్రతల సమస్యల దృష్ట్యా తక్షణమే మండల కేంద్రంలో శాశ్వత పోలీస్ స్టేషన్ను నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.