NRPT: ధన్వాడ మండల కేంద్రంలో తై బజార్ బహిరంగ వేలం ఈనెల 25న బుధవారం నిర్వహించనున్నారు అని గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో వేలం నిర్వహించబడుతుంది. పాల్గొనదలిచిన వారు పంచాయతీకి ఎలాంటి పాత బకాయిలు లేవని ధృవపరచుకోవాలి. ఆసక్తి గల వారు డిపాజిట్ డీడీలను ఈనెల 24వ తేదీ సాయంత్రంలోపు సమర్పించాలని పంచాయతీ కార్యదర్శి సూచించింది.