తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంపై వైద్య విద్య కళాశాలల యాజమాన్యాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఫిబ్రవరి 28తో కౌన్సెలింగ్ ముగిసిందని, గడువు పెంచాలని ఎన్ఎంసీకి విజ్ఞప్తి చేయగా.. ఎలాంటి సమాధానం రాలేదని కోర్టుకు వివరించాయి. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది.