RR: షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశాన్ని ఎర్రటి, నారింజ రంగులతో అలంకరించి ప్రకృతి అందాలను చాటిచెప్పాడు. సూర్యాస్తమయం సమయంలో ఆకాశంలో కనిపించిన రంగుల హరివిల్లు లాంటి దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు చాలామంది ప్రజలు తమ ఇళ్ల పై, రోడ్లపై నిలబడి ఈ అద్భుత క్షణాలను చూసి మురిసిపోయారు.