AKP: సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెంలో పరదేశిమాంబ ఆలయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలువురు భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా తయారు చేయించిన కంచు గుర్రాలు, పంచలోహ విగ్రహాలను ఊరేగించారు.