మెగా హీరోల చిత్రాల విడుదల తేదీలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30 నుంచి జూన్ 26కి వాయిదా పడే అవకాశం ఉండటంతో, చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై సస్పెన్స్ నెలకొంది. జూన్ 10న రావాల్సిన ‘విశ్వంభర’ వెనక్కి తగ్గనున్నట్లు టాక్. బాక్సాఫీస్ వద్ద క్లాష్‌ను నివారించేందుకు ‘పెద్ది’ డేట్ ఖరారైన తర్వాతే తన కొత్త తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం.