W.G: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే పరాభవం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ హెచ్చరించారు. పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర 23వ రోజుకు శుక్రవారం పెన్నాడ, గొరగనమూడి, విస్సాకోడేరు గ్రామాల్లో సాగింది. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సీపీఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.