SDPT: భద్రాచల శ్రీరామ చంద్రుని కళ్యాణం కోసం గజ్వేల్ సీఐ రవికుమార్ తన భక్తిని చాటుకున్నారు. స్వయంగా గోటితో వడ్లను వలిచి తయారు చేసిన ‘గోటి తలంబ్రాలను’ శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామరాజుకు అందజేశారు. స్వామివారి సేవలో ఈ అరుదైన అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని, ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని సీఐ ఆనందం వ్యక్తం చేశారు.