TPT: నారాయణవనంలో శుక్రవారం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారి ఊయల సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారిని తిరుచిపై వేంచేసి మంగళ వాయిద్యాలు నడుమ ఊయల సేవ రమణీయంగా నిర్వహించారు.