మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ భవన్ లో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం విధివిధానాలు రూపకల్పన కమిటీ తదితర విషయాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్కింగ్ జర్నలిస్టులందరికీ మేమున్నాం అంటూ భరోసానివ్వడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం పనిచేస్తుందని సంఘం అధ్యక్షుడు తెలిపారు.