GDWL: గట్టు మండలం మాచర్ల గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం సంధ్య రాళ్ల పోటీలు నిర్వహించబడ్డాయి. యువత ఉత్సాహంగా పాల్గొని తమ బలాన్ని ప్రదర్శించారు. గెలుపొందినవారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. గ్రామీణ సంప్రదాయ క్రీడలను కాపాడటమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు.