NLG: కేతేపల్లి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పసుపులేటి సైదులు బ్రెయిన్ క్లాట్ కారణంగా ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ‘లిటిల్ సోల్జర్స్’ ఆదుకుంది. ప్రతినిధులు శుక్రవారం సైదులు తండ్రి వెంకటేశ్వర్లుకు రూ.22,200 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.