MDCL: చిలుకానగర్ డివిజన్లో BRS నేత బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ముస్లిం సోదర సోదరీమణులకు ఇంటింటికీ వెళ్లి రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. పార్టీ నాయకులు, మస్జిద్ కమిటీ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు మస్జిద్ వద్ద లైన్లలో కాకుండా ఇంటి వద్దే తోఫాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. రంజాన్ పండుగను అందరు ఘనంగా జరుపుకోవాలన్నారు.