ELR: ఇంటి పన్ను చెల్లించకపోతే వారికి ఫైనల్ నోటీసులు జారీ చేసి ఆస్తులను జప్తు చేయాలని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. గురువారం ఆయన కార్యాలయం నుంచి మండలంలో పంచాయతీ అభివృద్ధి అధికారులకు ఇంటి పన్నుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పన్ను చెల్లించకపోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుళాయిలు డమ్మీతో పాటు పౌర సేవలు నిలిపివేయాలన్నారు.