PDPL: సుల్తానాబాద్ పోలీసుల సహాయంతో పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి బాధితులకు అప్పగించారు. గర్రెపల్లి గ్రామానికి చెందిన దీకొండ తిరుపతి, సుద్దాల గ్రామానికి చెందిన కాలువల నరేశ్, భూపతిపూర్కు చెందిన ఆత్రం ప్రకాశ్ ఫోన్లు పోగొట్టుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు.