NGKL: ఊర్కొండ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ను ఎంఈవో అబ్దుల్ రహీం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, స్వయంగా విద్యార్థులకు వడ్డించి వారితో ముచ్చటించారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని వంట ఏజెన్సీని, ఉపాధ్యాయులను ఆయన ఆదేశించారు.