MULG: ఏటూరు నాగారం మండలం కోయగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోరిక సరిత ‘ప్రజా వాణి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇవాళ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కరిస్తామని, అవసరమైతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.