BPT: కొత్తపేట మూడు రోడ్ల సెంటర్ గోపాల్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మినరల్ ఆర్వో ప్లాంట్ను చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శుక్రవారం ప్రారంభించారు. ప్లాంట్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.