కృష్ణా: బందరులో ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని నిర్మించడంతో పాటు, కోనేర్ సెంటర్లో జండా వీరుడు తోట నరసయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలు, న్యాయవాదులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు వినతిపత్రం అందజేశారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పట్టాభి భవనానికి అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.