TG: రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోందని ప్రచారం జరుగుతున్న వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ వేసవి కాలం ముగిశాకే ఎన్నికలు జరగవచ్చని అన్నారు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. ఈ సమ్మర్ అయ్యాకే ఎన్నికలు అని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతుందని విడతల వారీగా విస్తరణ ఉంటుందని తెలిపారు.