NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన దేవరకొండ ఆర్టీసీ డిపో కార్మిక సంఘం జేఏసీ నాయకులను శనివారం ఘనంగా సన్మానించారు. ఛైర్మన్ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ ఓరుగంటి రమేష్ గౌడ్, కోశాధికారి ఆర్ నందులను శాలువాతో సత్కరించారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కార్మికుల పోరాటానికి బీసీ సంఘం మద్దతు ఉంటుందన్నారు.