NLG: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం జలాధివాసం, ఆదివారం ధాన్యాధివాసం, పుష్పాధివాసం కార్యక్రమాలు ఉంటాయి. చివరి రోజు సోమవారం విగ్రహ ప్రతిష్ఠాపనలు, అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆ గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ తెలిపారు.