BPT: సంతమాగులూరు మండలం ఎల్చూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చేపల చెరువుకు ఈ నెల 21న వేలంపాట నిర్వహించనున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వేలంపాటను నిర్వహించనున్నారు. చెరువు అంచనా ఆదాయం రూ.13,88,473గా నిర్ణయించగా, వేలంలో పాల్గొనదలచిన వారు రూ.2,00,000 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.