ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఇవాళ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని పిల్లలను పాఠశాలకు పంపాలని కోరారు. విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించి, ప్రతి చిన్నారికి చదువు ఎంతో అవసరమని తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను వివరించారు.