NDL: జనాభా లెక్కలు- 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. ఈ విధానం పారదర్శకత పెంచడంతో పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. జనాభా లెక్కలు సంక్షేమ పథకాల రూపకల్పనకు ఉపయోగపడతాయని అన్నారు.