జగిత్యాల జిల్లాకు త్వరలో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (POPSK) ఏర్పాటు కానుంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బోగ శ్రావణి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.