అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ‘శక్తి టీమ్’ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, సైబర్ నేరాలపై ఇవాళ డీఎస్పీ కృష్ణమోహన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, సీఐలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.