GNTR: అమరావతి రోడ్డులోని అమరావతి బిల్డింగ్స్‌లో కళారత్నాలు సాహితీ సమస్తం ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరుకు చెందిన కవి సౌపాటి ప్రభాకర్ కవితా గానం ద్వారా ఆకట్టుకున్నారు. నిర్వాహకులు ఆయనను సత్కరించి మెమొంటో, ప్రశంసా పత్రం అందజేశారు. గ్రామస్తులు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు.