W.G: ప్రజల అర్జీలను, వినతిపత్రాలను పరిశీలించి సత్వర పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇంఛార్జి తోట సీతారామలక్ష్మీ తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.