JN: రఘునాథపల్లి మండలం బాంజీపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన మార్గం చదువు అని, చదువు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారామని తెలిపారు. చదువు ఆత్మవిశ్వాసాన్ని, సంస్కారాన్ని తీసుకువస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.