SDPT: జగదేవ్పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పొలం పనులు ముగించుకుని వస్తున్న కొంతం రామవ్వ(60)ను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. ఆమె మెడలోని రెండు తులాల నల్లపూసల గొలుసును బలవంతంగా తెంపుకుని బైక్పై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.