KNR: చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఆదివారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచులకు వరం లాంటిది కల్యాణ లక్ష్మి అని అన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.