MDK: మెదక్ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికలు ఘనవిజయం సాధించి తమ హవా చాటారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 61.54% ఉత్తీర్ణతతో బాలుర (46.99%) కంటే ముందున్నారు. ద్వితీయ సంవత్సరంలోనూ అదే జోరు కొనసాగిస్తూ బాలికలు 75.34%, బాలురు 58.90% ఉత్తీర్ణత సాధించారు. రెండు ఏళ్ల ఫలితాల్లోనూ బాలుర కంటే బాలికలే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పైచేయి సాధించడం విశేషం.