నిరుద్యోగులకు TCS శుభవార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. డిమాండ్‌ను బట్టి మరింత మందిని నియమించుకునే అవకాశం ఉందని చెప్పింది. 2025-26లో 44 వేల మందికిపైగా యువతకు అవకాశం కల్పించింది. అయితే అదే ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.