లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూత పట్ల సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మృతి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. తరతరాల పాటు తన గాత్రంతో ఎన్నో భావోద్వేగాలను పలికించిన ఆమె స్వరం చిరస్మరణీయమని కొనియాడారు. ఎన్టీఆర్, చిన్మయి, అడివి శేష్, శంకర్ మహదేవన్ వంటి ప్రముఖులు ఆమెకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.