TPT: తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కుమారుడు అరణి మదన్ మోహన్ తమ సంస్థ తరఫున టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు శుక్రవారం రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీని అందజేశారు. అనంతనం వారిని ఈవో సన్మానించారు.