TG: సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సరోగసి కేసులో ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. విచారణలో రూ.40 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఏజెంట్లు, తల్లిదండ్రులకు నమ్రత రూ.20 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. పదేళ్లుగా 2014-2025లో ఫైనాన్సియల్ నెట్వర్క్ నడిపి రూ.29.7 కోట్లు వెనుకేసుకున్నట్లు వెల్లడించారు. ఒక్కో డెలివరీకి రూ.10-23 లక్షలు తీసుకున్నట్లు సమాచారం.