KNR: హుజూరాబాద్, కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైతులు జనగామ జిల్లా నర్మెట్టలో జరిగే రైతు ఉత్సవాలకు శుక్రవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం ఈనెల 19 నుంచి 22 వరకు నిర్వహించే రైతు ఉత్సవాలలో ప్రతి మండలం నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.