TG: హైదరాబాద్ బిర్యానీకే కాక, తెలుగు సినిమాకు కూడా దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సౌత్ కొరియా తరహాలో సినిమా రంగాన్ని తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. ఇండియన్ సినిమాకు హైదరాబాద్ కేంద్రంగా మారాలని, గద్దర్ పేరుతో అవార్డులు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.