TG: తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉందని మాధురీ దీక్షిత్ కొనియాడింది. గద్దర్ అవార్డుల వేదికపై టాలీవుడ్ సినీ లెజెండ్స్‌ను కలుసుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపింది. ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. దక్షిణాది సినిమా సాధిస్తున్న విజయాలు భారతీయ సినిమాకే గర్వకారణమని వ్యాఖ్యానించింది.