TG: హైదరాబాద్‌లో ఆహార కల్తీ నియంత్రణపై పోలీస్‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్‌ల ఆధ్వర్యంలో ఆహార కల్తీ నియంత్రణపై కొత్త విభాగం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్(H-FAST) పేరుతో ప్రత్యేక టీమ్‌ను సీపీ సజ్జనార్ ఏర్పాటు చేశారు. 28 మంది సభ్యులతో H-FAST టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు అయింది.