GNTR: పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఈ-వేస్ట్ సేకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు తెలిపారు. ప్రజలు పాత ఎలక్ట్రానిక్ వస్తువులు అందజేసి స్వచ్ఛ పొన్నూరుకు సహకరించాలని కోరారు. ప్రతి నెల 10, 20 తేదీల్లో సేకరణ కొనసాగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.