టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో బాలకృష్ణతో కలిసి నటించబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడ వేగ-2’ కోసం సిద్ధమైన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన వెల్లడించారు. తామిద్దరం కలిసి నటిస్తే ఇద్దరు చిన్నపిల్లలు చేసినట్టు ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శర్వానంద్ ‘బైకర్’ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.