AP: రంజాన్ పండుగ తేదీ మార్పుతో మార్చి 21న సెలవు ప్రకటించారు. దీంతో ఆ రోజు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి (ఉ.9:30 – 12:45) వాయిదా వేశారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సర ఐపీఈ పరీక్షను కూడా మార్చి 21 నుంచి 25వ తేదీకి మార్చారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.