AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 3 గంటల్లో పిడుగుల వాన పడుతుందని APSDMA తెలిపింది. కోనసీమ, ప.గో, NTR, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు.. అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.