KRNL: పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గూడూరు మండలం నాగలాపురంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆమె, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.