TG: మాదాపూర్ ప్రాంతంలో ఎస్ఓటీ పోలీసులు, భారీగా హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుని వద్ద 180 బాటిళ్లను (920 గ్రాములు) డ్రగ్స్ పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. దినేష్ అనే వ్యక్తిని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్ లో అమ్మడానికి ప్రయత్నించే క్రమంలో పట్టుకున్నారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరో నలుగురు పరారీలో ఉన్నారు.