ఖమ్మం భూధాన్ భూముల్లో భారీమోసం వెలుగులోకి వచ్చింది. 38 మంది భూధాన్ బాధితుల నుంచి సుమారు 54.13 లక్షలు వసూలు చేసినట్లు ACP కార్యాలయంలో గురువారం ఫిర్యాదు నమోదైంది. ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసి నకిలీ రసీదులు సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు పోలబోయిన ముత్తయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.