MBNR: కౌకుంట్ల వెంకటగిరిలో శ్రీ శ్రీ శ్రీ కోదండ రామాలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పుణ్యకార్యానికి ఓ సంఘం సభ్యులు రూ.22 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, నిర్వాహకులకు అందజేశారు. ఆలయ నిర్మాణంతో గ్రామానికి మేలు జరుగుతుందని వారు ఆకాంక్షించారు. భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆలయ పూర్తికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.